Monday, 24 March 2008

కొత్త యేడు (రు)

MyPoem published in http://thatstelugu.oneindia.in/sahiti/kavitha/poem-by-sreenath.html.

కొత్త యేడు (రు)

ఇంకో కొత్త యేడు
పేజీలోకి దొర్లింది...
నిశ్శబ్ద గోదావరిలా,
చడిచప్పుడు లేకుండా
వడివడిగా వచ్చింది!!

పాత యేడు పాపాల కొమ్మలు వదిలేసి,
జ్ఞాపకాల ఫలాలను ఆస్వాదిస్తూ
దిగ్భ్రాంతిగా కెరటాలను
పున్నమి వెలుగులో చూసాను!!

ఏ దారో ఈ ధారది!!
గమ్యం కోసం వెదుకులాడింది
తనతో పాటు
అందరినీ కదిలించి తీసుకువెళ్తుంది
ఎదురీది పాతతీరం చేరుదామంటే!!
ఈ అంతర్గామికి
ఎదురీదడంఎవరికి సాధ్యం??

అందుకే ఈ కాలగామితో
నేను కదిలాను!!
పాత వాసనల్ని వదిలేసి
కొత్త తలపులు హత్తుకున్నాను

తీరం వెదుకుతూ ఇంకో
సరికొత్త యాత్ర తలకెత్తాను!!

Thursday, 20 March 2008

తెలుగు ఛందస్సు - ద్విపద పద్యము.

లక్షణములు

  • ఈ పద్యానికి రెండు పాదాలు మాత్రమే ఉంటాయి (అందుకే దీనిని ద్విపద అంటారు)
  • ప్రతిపాదములోనీ మూడు ఇంద్ర గణాలు, ఒక సూర్య గణము ఉంటుంది.

యతి: మూడవ గణం యొక్క మొదటి అక్షరం.

ప్రాస: ప్రాస ఉన్న ద్విపదను సామన్య ద్విపద, అదే ప్రాస లేకుండా ద్విపద వ్రాస్తే దానిని మంజరీ ద్విపద అని పిలుస్తారు.

ఉదాహరణలు

గోన బుద్దారెద్ది గారి రంగనాథ రామాయణము

ద్విపద

అపరిమిత ప్రీతినా భగీరథుని

తపమిఛ్ఛమెఛ్ఛనే కందర్ప సంహరుని

గణాలు లెక్కిస్తే...

అపరిమి =ఇంద్ర గణము

తప్రీతి = ఇంద్ర గణము

నాభగీ = ఇంద్ర గణము

రధుని = సూర్య గణము

యతి అక్షరాలు

రిమిత ప్రీతినా భగీరథుని


ప్రాస "ప" అక్షరము

Sunday, 16 March 2008

పంచేంద్రియాలేవి?

My poem published in www.thatstelugu.com on 11-Nov-2005.
పంచేంద్రియాలేవి?
కొండలు కొనలుదాటి
నాకోసం విచ్చేసే
మలయమారుత
సవ్వడులేవి?
విచ్చేసిన వసంతానికి
అభివాదం చేసే ఆ
పచ్చని పచ్చికలేవి?
తొలివానకు స్వాగతం
తెలుపుతూ ధరిత్రిజల్లే
ఆ వాసనలేవి?
రంగురంగుల సుమాలను
చిలికి తుమ్మెదలు
పోగేసిన తేనియలేవి?
జీవిత పుటాలు తిరగేస్తే
మరువలేని ఆ
ప్రేమపూర్వక స్పర్శలేవి?
-శ్రీనాథ్ రెడ్డి కొండ

Wednesday, 5 March 2008

Passed PMP

I passed PMP (Project Management Professional) on 25th Feb. It is good to continue learning. It took 3 months rigorous preparation and observation with the work I do in office and following a strict code of conduct. Its nice to have certified as PMP.
Thanks to all the mail groups who put lot of material to study and analyze.