లక్షణములు
- పాదాలు: నాలుగు
- ప్రతి పాదంలోనూ అక్షరాల సంఖ్య: 20
- ప్రతిపాదంలోని గణాలు: భ (UII), ర(UIU), న(III), భ, భ, ర, వ(IU)
- యతి : ప్రతిపాదంలోనూ 10 వ అక్షరము
- ప్రాస : పాటించవలెను.
ఉదాహరణ 1:
ఓ యరవింద బంధుత సమూచిత మల్లిక ,విశ్వజైత కన్
సోయగ నాయకి, విరుల శోభ కనుంగవ నింప, అందమా
ఆయది చందమాయను సుహస సుదల్ గురిపించ, చంచలా
క్షీ, యుత గీతికా పదుల కీర్తన జేయగ తుమ్మెదయ్యెడిన్!!